: కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రారు భారీగానే సంపాదించారు... ఏసీబీ సోదాల్లో గుర్తించిన పలు ఆస్తులు!

హైదరాబాదులోని మియాపూర్ భూముల కుంభకోణంలో నిందితుడు కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు నివాసంపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు అక్రమాలను గుర్తించారు. శ్రీనివాసరావు అక్రమంగా సంపాదించిన డబ్బును, ఆస్తులను తన బంధువుల పేరుమీద ఉంచినట్టు గుర్తించారు. తన బావమరిదికి చెందిన నార్త్ స్టార్ ప్రాజెక్ట్స్ సంస్థ, మరణించిన తన భార్య పేరు మీదున్న జయశ్రీ ప్రాజెక్ట్స్ తో పాటు, తన కుమారుడి హాసిని ప్రాజెక్ట్స్ సంస్థ పేరుమీద భారీ ఎత్తున లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించారు.

అలాగే శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు 10 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు. వివిధ బ్యాంకులకు చెందిన 17 క్రెడిట్ కార్డులను గుర్తించారు. అలాగే వారి సంస్థల పేరిట మూడు సార్లు రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఒకేసారి ట్రాన్జాక్షన్స్ జరిగినట్టు గుర్తించారు. దీంతో ఆయన అక్రమాస్తులు 200 కోట్లకు పైగా ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News