: హైకోర్టులో వైఎస్ జగన్ కు చుక్కెదురు... నందిగామ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశం!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామ వద్ద ఓ ప్రైవేటు బస్సు యాక్సిడెంట్ జరిగిన తరువాత, అక్కడికి వెళ్లిన జగన్ ఆసుపత్రిలో కలెక్టర్, వైద్యులపై దురుసుగా ప్రవర్తించినట్టు ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టి వేయాల్సిందిగా కోరుతూ జగన్ తరఫున న్యాయవాదులు, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం, జగన్ దురుసు ప్రవర్తనపై ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నందున పిటిషన్ కొట్టివేసేందుకు నిరాకరిస్తున్నట్టు తీర్పిచ్చింది. కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది.

More Telugu News