: ఈ ఫోన్ మోడల్స్ వాడుతుంటే, నెలాఖరుతో వాట్స్ యాప్ బంద్!

ఓల్డ్ సాఫ్ట్ వేర్ ఆధారిత ఫోన్లలో వాట్స్ యాప్ సేవలను ఈ నెలాఖరు నుంచి నిలిపివేయనున్నట్టు సంస్థ తెలిపింది. బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10,నోకియా ఎస్ 40, నోకియా ఎస్ 60 తదితర ప్లాట్ ఫాంలపై ఈ నెల 30 నుంచి సపోర్ట్ ఇవ్వరాదని నిర్ణయించినట్టు పేర్కొంది. కాగా, గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఆండ్రాయిడ్ 2.2, ఐఓఎస్ 6, విండోస్ ఫోన్ 7 తదితరాలకు వాట్స్ యాప్ సేవలు నిలిచిన సంగతి తెలిసిందే.

 "ఈ ప్లాట్ ఫాంలు మరింత మెరుగైన సేవలను అందుకునేలా లేవు. మా యాప్ ఫీచర్లను మరింతగా మెరుగు పరచాలని భావిస్తున్నాం. ఎవరైనా కస్టమర్లు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతూ ఉంటే, మరింత అప్ గ్రేడెడ్ వర్షన్ కు మారాలని సూచిస్తున్నాం. ఆండ్రాయిడ్ 2.3.3 ప్లస్ కన్నా అధికంగా ఉన్న సిస్టమ్స్ పైనే ఇక వాట్స్ యాప్ పని చేస్తుంది" అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News