: ఖరారైన పర్యటన... 25, 26 తేదీల్లో ట్రంప్, మోదీ భేటీ

ఈ నెలాఖరులో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను 25, 26 తేదీల్లో కలుసుకోనున్నారు. వైట్ హౌస్ లోనే మోదీకి ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా, పారిస్ ప్రపంచ పర్యావరణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన ట్రంప్, ఇండియా, చైనాలను తిట్టిపోసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మోదీ యూఎస్ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలపరిచేలా సాగుతుందని, అమెరికాతో పలు అంశాలను మోదీ టీమ్ చర్చిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదం, ఆఫ్గనిస్థాన్ కు మద్దతు, చైనా వైఖరి తదితరాంశాలతో పాటు హెచ్-1బీ వీసాలపై భారతీయుల ఆందోళననూ ట్రంప్ దృష్టికి మోదీ తీసుకు వెళ్తారని సమాచారం. మోదీ, ట్రంప్ ల మధ్య చర్చలు జరిగే సమయంలోనే భారత అధికారులు, అమెరికన్ అధికారుల మధ్య పలు అంశాలపై చర్చలు సాగుతాయని, యూఎస్ లోని ప్రవాస భారతీయులనూ మోదీ ప్రత్యేకంగా కలుసుకుంటారని ఓ అధికారి తెలిపారు.

More Telugu News