: డైనోసార్ల సమకాలీన పక్షి శిలాజం లభ్యం!

భూమిపై అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు మయన్మార్ లోని ఒక గనిలో గుర్తించి ఆశ్చర్యపోయారు. మయన్మార్ లో ఒక గనిలో తవ్వకాలు జరుపుతుండగా ఈ శిలాజాలు లభ్యమయ్యాయి. దీంతో వివిధ పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు ఈ పక్షి శిలాజం భూమి మీద డైనోసార్లు జీవించిన కాలం అంటే సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితానికి చెందినవని చెబుతున్నారు. వారు గుర్తించిన పక్షి పిల్ల ప్రస్తుతం కర్పూర పచ్చనిధి లేదా సీమ గుగ్గిలంగా పేర్కొనే జేగురు రంగు స్ఫటికంలో చిక్కుకున్నదని వారు చెబుతున్నారు. ఈ స్పటికంలో పక్షి రెక్కలు, ముక్కు, తోక, ఇతరత్రా భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు తెలిపారు. 10 కోట్ల ఏళ్లనాటి స్ఫటికంలో పక్షికి సంబంధించిన శిలాజాలు, ఇంత స్పష్టంగా కనిపించడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు. 

More Telugu News