: జీఎస్టీ వల్ల ఈ వస్తువుల ధరలు తగ్గాయి: అరుణ్ జైట్లీ

జులై 1 నుంచి అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోని 66 రకాల వస్తువులపై భారీగా విధించిన పన్నుల శాతాన్ని కొంత మేర తగ్గించామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌ లో నిర్వహించిన 16వ జీఎస్టీ మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వ్యాపారులు, పౌరసమాజం నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి 66 రకాల వస్తువులపై పన్ను శాతాన్ని తగ్గించామని అన్నారు.

వాస్తవానికి 133 రకాల వస్తువులపై పన్ను శాతం తగ్గించాలని ప్రతిపాదనలు వచ్చాయని, అయితే అందులో కేవలం 66 వస్తువులపై పన్నులు మాత్రమే తగ్గించాలని నిర్ణయించామని అన్నారు. అలాగే ఉత్పత్తిదారులు, వ్యాపారులు, రెస్టారెంట్ల యజమానులకు ప్రభుత్వం అందించే నష్ణపరిహార పథకం పరిధిని కూడా పెంచామని అన్నారు. గతంలో కేవలం 50 లక్షల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థలకు మాత్రమే ఇస్తామని చెప్పిన జీఎస్టీ మండలి ఇప్పుడు 75 లక్షల టర్నోవర్ ఉన్న సంస్థలకు కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది.
 
అగర్‌బత్తీలు - 12శాతం నుంచి 5 శాతానికి కుదింపు.
బాదాంపప్పు - 12 నుంచి 5 శాతానికి తగ్గింపు.
ప్యాకింగ్‌ చేసిన ఆహార పదార్థాల(పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు) - 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు.
కంప్యూటర్‌ ప్రింటర్లు -  28 శాతం నుంచి 18కి కుదింపు.
స్కూల్‌ బ్యాగులు - 28 శాంతం నుంచి 18 శాతానికి తగ్గింపు.
డెంటల్‌ వాక్స్‌ - 28 నుంచి 18 శాతానికి తగ్గించారు.
ఇన్సులిన్‌ - 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.
ప్లాస్టిక్‌ బెడ్స్‌ 28 నుంచి 18 శాతానికి తగ్గించారు.
ప్లాస్టిక్‌ టర్పాలిన్‌ 28 నుంచి 18 శాతానికి తగ్గించారు.
ఎక్సర్‌ సైజ్‌ పుస్తకాలు 18 నుంచి 12 శాతానికి తగ్గించారు.
కలరింగ్‌ బుక్స్‌ పై 12 శాతంగా ఉన్న పన్నును పూర్తిగా ఎత్తేశారు
ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ పైపులు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
ట్రాక్టర్‌ విడిభాగాలు 28 శాతం నుంచి 18 శాతానికి కుదింపు

More Telugu News