: పొరపాటుగానో, గ్రహపాటుగానో ఒక రోజు శృంగారంలో పాల్గొంటే పెళ్లి జరిగినట్టు కాదు.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

స్త్రీపురుషులిద్దరు ఒక్క రాత్రి ఒక్కటైనంత మాత్రాన అది వివాహం కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశం రావడం వల్లో, చాన్స్ తీసుకోవడం వల్లనో, లేదంటే అనుకోకుండానో జరిగే శృంగారం హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లికి నిర్వచనం కాదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. అలా పుట్టిన సంతానానికి తండ్రి ఆస్తిపై హక్కులు ఉండవని పేర్కొంది. వివాహం కాకుండా అది చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 16 గురించి ప్రస్తావించిన జస్టిస్ మృదుల భట్కర్.. ఈ చట్టం వివాహాన్ని నియంత్రిస్తున్నప్పటికీ సామాజికంగా జరుగుతున్న మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొన్ని దేశాలు హోమో సెక్స్‌వల్ యూనియన్లను వివాహంగా అంగీకరిస్తున్నాయన్నారు. ఫలితంగా సహజీవనం వల్ల కలిగే సంతానం విషయంలో పలు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. చట్టాన్నే సవాలు చేసే పరిస్థితి ఎదురవుతోందన్నారు. వివాహ నిర్వచనాన్ని ఇది మారుస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తాజా కేసులో ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అతడి రెండో పెళ్లి చట్టబద్ధం కానప్పటికీ ఆధారాలు ఉండడంతో ఆ వివాహం ద్వారా పుట్టిన కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కులు ఉంటాయని తీర్పు చెప్పింది.

More Telugu News