: పాకిస్థాన్ కు చీవాట్లు పెట్టిన చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్

చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్ లో ఇద్దరు చైనా టీచర్లను ఉగ్రవాదులు హత్య చేయడంపై అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ స్పందించారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించిన ఆయన, పాకిస్థాన్ కు చీవాట్లు పెట్టారు. చైనీయుల హత్యకు నిరసనగా, కజకిస్థాన్ రాజధాని అస్థానాలో జరుగుతున్న షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో జరపాల్సిన చర్చలను జిన్ పింగ్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక చైనా మీడియా సైతం నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్ లతో జిన్ పింగ్ సమావేశానికి పెద్ద పీట వేసింది. బెలూచిస్థాన్ ప్రాంతంలో ఇద్దరు చైనా వాసులను కిడ్నాప్ చేసి హత్య చేయడాన్ని తమ దేశ ప్రజలు జీర్ణించుకోలేకున్నారని క్సీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కాగా, ఈ ఘటన దురదృష్టకరమని, అంతమాత్రాన 50 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పై ప్రభావం ఉండదని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

More Telugu News