: పాము కుబుసం విడిచినట్టు.. ఆరేళ్ల ఈ చిన్నారి రోజూ చర్మాన్ని విడిచిపెడుతోంది.. వైద్యులకు సవాలుగా మారిన వైనం!

అమెరికాలోని ఊల్టెవాకు చెందిన ఆరేళ్ల చిన్నారి హన్నా బారోట్ ఇప్పుడు వైద్యులకు సవాలుగా మారింది. పాము కుబుసం విడిచినట్టు ఈ చిన్నారి చర్మం రోజూ రాలిపోతోంది. ఆ వెంటనే కొత్త చర్మం పుట్టుకొస్తోంది. కొత్త చర్మ కణాలు అత్యంత వేగంగా పుట్టుకు రావడం వైద్యులను విస్మయ పరుస్తోంది. చిన్నారి లామెల్లర్ ఇచ్‌థైయోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

చిన్నారి చర్మ గ్రంధులు మూసుకుపోవడంతో ఆమెకు చెమట పట్టడం లేదు. ఇది మరింత ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండడంతో ఆమె తల్లిదండ్రులు మేగాన్, టైసన్‌లు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. నిరంతరం కుమార్తె శరీరానికి లోషన్లు రాస్తూ పొడిబారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ చిన్నారి చర్మం పొడిబారితే  అది పగిలిపోయి రక్త స్రావం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

More Telugu News