: ఖతార్‌కు మా మద్దతు.. నిత్యావసర సరుకులను ఎగుమతి చేస్తాం: టర్కీ

ఉగ్రవాదానికి సహకరిస్తోందని ఆరోపిస్తూ ఖతార్‌పై సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రేయిన్‌, ఈజిప్టు తదితర దేశాలు ఖతార్‌పై ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఖ‌తార్‌కు ఎటువంటి సాయం చేయ‌కూడ‌ద‌ని, దానికి మ‌ద్ద‌తు తెలుపుతూ వార్తలు రాస్తే జైలు శిక్ష విధిస్తామ‌ని కూడా సౌదీ అరేబియా పేర్కొంది. అయితే, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం ఖతార్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు. ఖ‌తార్‌లోని ప్రజలకు తాము నిత్యావసర సరుకులను ఎగుమతి చేస్తామని తెలిపారు. ఆ దేశంపై విధించిన ఆంక్షలపై సౌదీ అరేబియా పునరాలోచించాలని సూచించారు.          

More Telugu News