: ఎయిర్ ట్రావెల్ సంస్థలకు ఆశోక్ గజపతిరాజు వార్నింగ్

ఎయిర్ ట్రావెల్ నిర్వాహకులపై విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమాన సంస్థల నిర్వాకం వల్ల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. ఎయిర్ ట్రావెల్ సంస్థలు అనైతిక విధానాలు అవలంబిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విమాన టికెట్‌ రద్దు చేసుకున్న ప్రయాణికులకు పన్ను, సుంకాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, ఎయిర్ ట్రావెల్ సంస్థలు అలా చెల్లించడం లేదని ఫిర్యాదులందుతున్నాయని ఆయన చెప్పారు. ప్యాసెంజర్ ఫ్రెండ్లీ విధానం అమలులోకి వచ్చిన తరువాత టికెట్ రద్దు చేసుకుంటే పన్ను, సుంకాలు తిరిగి చెల్లించాలని, అలా చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

More Telugu News