: ప్రపంచంలో అత్యంత కలుషితమైన నది ఇదే!

ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదిగా చైనాలోని యాంగ్జీ నది నిలిచింది. ఈ నదిలోకి ప్రతి ఏడాది 3 లక్షల 30 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తున్నారట. దీని తర్వాత రెండో స్థానంలో హిందువులకు అత్యంత పవిత్రమైన గంగానది నిలిచింది. గంగలో ఏడాదికి లక్ష15వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తున్నాయట. నెదర్లాండ్ కు చెందిన 'ది ఓషన్ క్లీన్ అప్' సంస్థకు చెందిన పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. మూడు నాలుగు స్థానాల్లో చైనాకే చెందిన జీ డాంగ్, జుజియాంగ్ లు ఉన్నాయి. ఈ నదుల వల్ల సముద్ర జలాలు కూడా కలుషితమవుతున్నాయని సదరు సంస్థ వెల్లడించింది.

More Telugu News