: 'కూతురితో సెల్ఫీ' యాప్ ను లాంచ్ చేసిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ రోజు 'కూతురితో సెల్ఫీ (సెల్ఫీ విత్ డాటర్)' మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. అమ్మాయిలు వద్దంటూ అబార్షన్లకు పాల్పడుతున్న వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, ప్రజలంతా తమ కూతుర్లతో సెల్ఫీలు దిగి, వాటిని అప్ లోడ్ చేయాలని... తద్వారా ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్నారని చెప్పారు. లైంగిక వివక్షను రూపుమాపడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా రాష్ట్రపతి అన్నారు.

ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటంటే... అమ్మాయిలను కన్న తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ కావడం, సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తిని సమతుల్యం చేయడం. ఈ కార్యక్రమాన్ని సునీల్ జగ్లాన్ అనే వ్యక్తి జూన్ 2015లో హర్యాణాలోని బీబీపూర్ గ్రామంలో ప్రారంభించాడు. మాజీ సర్పంచ్ అయిన సునీల్... మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి కోసం పని చేస్తున్నారు.

More Telugu News