: ఎన్నికల్లో ఓడినా ప్రధాని పదవిని వీడేది లేదు: తేల్చి చెప్పిన థెరిస్సా మే

తన పార్టీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించడంలో విఫలమైనప్పటికీ, ప్రధాని పదవికి తాను రాజీనామా చేసేది లేదని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే స్పష్టం చేశారు. తమ పార్టీకి ఆధిక్యత కొంత తగ్గిందని, దానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని వెల్లడించిన ఆమె, దేశంలో సుస్థిర పాలన కోసం ఇతర పార్టీల మద్దతు తీసుకుంటామని అన్నారు.

 ఈ ఎన్నికల్లో మెయిడెన్ హెడ్ నుంచి ఎంపీగా విజయం సాధించిన ఆమె, తన పార్టీ మిగతా పార్టీల కన్నా ఎక్కువ సీట్లతో పాటు, ఎక్కువ ఓట్లను గెలుచుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అత్యధికులు తమపైనే బాధ్యతలు ఉంచారని, మెజారిటీకి 326 స్థానాలు కావాల్సిన చోట, తాము కేవలం 11 స్థానాలు మాత్రమే వెనుకబడి వున్నామని గుర్తు చేశారు. కాగా, లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్ ఎన్నికలపై స్పందిస్తూ, థెరెసా మే తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News