: నాగలి పట్టి ఎద్దులను అదిలించిన చంద్రబాబు... కదిలిన రైతన్నలు!

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందంగా ఏరువాక సాగుతున్నారు. ఏపీలో పంటల సీజన్ ప్రారంభమైంది. ఈ ఉదయం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఉడేగోళంలో ఏరువాకను అధికారికంగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పటికే భూములు దుక్కి దున్ని, ఎరువులు, విత్తనాలను సమకూర్చుకున్న రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ సీజనులో సకాలంలో, వర్షాలు కురుస్తాయని, సంతృప్తికర వాతావరణం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆపై నాగలి పట్టి స్వయంగా దుక్కి దున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

More Telugu News