: బ్రిటన్ ప్రధాని రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్... ఎవరికెన్ని సీట్లంటే..!

అనుకున్న విధంగా ప్రజా మద్దతు పొందలేకపోయిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంటులో ప్రస్తుతం 643 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిల్లో థెరిస్సా మే నేతృత్వంలోని కన్సర్వేటివ్ అండ్ యూనియనిస్ట్ పార్టీకి 313 సీట్లు లభించాయి.

ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీకి 260 సీట్లు, స్కాటిష్ నేషనల్ పార్టీకి 35, లిబరల్ డెమోక్రాట్లకు 12, ఇతరులకు 23 సీట్లు లభించాయి. గత పార్లమెంటుతో పోలిస్తే కన్సర్వేటివ్ పార్టీ 12 స్థానాలను, స్కాటిష్ నేషనల్ పార్టీ 21 స్థానాలను కోల్పోగా, లేబర్ పార్టీ 29 చోట్ల తన బలాన్ని పెంచుకుంది. మరో 7 స్థానాల్లోనే ఫలితాలు రావాల్సివుండటంతో, థెరిస్సాకు పూర్తి మద్దతు లభించే అవకాశాలు మృగ్యమే. ఈ నేపథ్యంలో ఆమె వెంటనే రాజీనామా చేయాలని లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బైన్ డిమాండ్ చేశారు.

More Telugu News