: రాజస్థాన్ పాఠ్యపుస్తకాల్లో గాంధీకి తగ్గిన ప్రాధాన్యత.. వీరసావర్కర్ పై పాఠాలు!

బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకాల్లో జాతిపిత మహాత్మాగాంధీ, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించిన పాఠాల నిడివిని తగ్గించారు. ఆ స్థానంలో వీరసార్కర్ కు ప్రాధాన్యమిస్తూ కొత్త పాఠాలను చేర్చారు. పదో తరగతి రివైజ్డ్ సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకాల్లో మహాత్మా గాంధీకి సంబంధించిన పాఠాలకు ప్రాధాన్యత తగ్గించారు. పది, పదకొండు, పన్నెండవ తరగతి రివైజ్డ్ పాఠ్యపుస్తకాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్, దేశ భాష హిందీ, ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ విధానాలు (ముఖ్యంగా పాకిస్థాన్ కు సంబంధించి) అనే అంశాలు ఉన్నాయి.  వీర సావర్కర్  గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని ఆ పాఠ్యాంశంలో పేర్కొన్నారు. గోపాల కృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన పాఠాలు ఆ పాఠ్యపుస్తకంలో ఉన్నాయి.
 

More Telugu News