: అది మ్యాసివ్ హార్ట్ ఎటాక్... పాల్వాయిని రక్షించుకోలేకపోయాం: మల్లు రవి

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డిని రక్షించుకోలేక పోయామని పార్టీ నేత మల్లు రవి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సిమ్లాలో ఆయన మరణించగా, మృతదేహాన్ని రాష్ట్రానికి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడామన్నారు. కారులో ప్రయాణిస్తున్న వేళ, ఆయనకు మ్యాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, పక్కనే ఉన్నవారు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని తెలిపారు.

ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని చెబుతూ, ఆయన కుటుంబానికి మల్లు రవి సంతాపాన్ని తెలిపారు. పాతతరం నేతలకు ప్రతినిధిగా పాల్వాయి నిలిచారని, కాంగ్రెస్ కుటుంబానికి ఆయనెంతో విధేయుడని, నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియాలతో కలసి పనిచేసిన నేతని కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణకూ తీరని నష్టమని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాల్సిందేనని సోనియాతో పలుమార్లు వాదించి ఒప్పించిన ఘనత ఆయనదేనని గుర్తు చేసుకున్నారు.

More Telugu News