: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రీ లుక్ పోస్టర్ అదుర్స్

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ‘జవాన్’ ప్రీ లుక్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి బివియస్ రవి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇంటికొక్క‌డు అనే ఉప శీర్షిక పెట్టిన ఈ ‘జ‌వాన్’ చిత్రంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న‌ మెహరీన్ నటిస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ తుదిద‌శ‌లో ఉంది. ఈ రోజు విడుద‌ల చేసిన ప్రీ లుక్ మెగా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వ‌ర్షం ప‌డుతుండ‌గా ప‌రిగెత్తుకుంటూ వెళుతున్న హీరో లుక్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ ప్రీ లుక్‌ను సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసి ఈ సినిమాలో త‌న పేరు జై అని చెప్పాడు.                    
<blockquote class="twitter-tweet" data-lang="en-gb"><p lang="en" dir="ltr">Introducing Jai, the man of the Nation and Family. <a href="https://twitter.com/hashtag/JawaanPreLook?src=hash">#JawaanPreLook</a> -Team Jawaan <a href="https://t.co/AYrltxowmW">pic.twitter.com/AYrltxowmW</a></p>— Sai Dharam Tej (@IamSaiDharamTej) <a href="https://twitter.com/IamSaiDharamTej/status/872762698672381952">8 June 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News