: ఆ విమానం సముద్రంలో కూలిపోయింది...119 మంది జలసమాధి: మయన్మార్ ప్రభుత్వ ప్రకటన

105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న మయన్మార్ మిలటరీ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. మయిక్‌, యాంగాన్‌ పట్టణాల మధ్య మధ్యాహ్నం 1:35 నిమిషాలకు గ్రౌండ్ కంట్రోల్, రాడార్ తో సంబంధాలు కోల్పోయిన మయన్మార్ కు చెందిన వై-8ఎఫ్-200 విమానం దవాయ్‌ పట్టణానికి పశ్చిమంగా 20 మైళ్ల దూరంలో గల్లంతైంది. దీంతో ఆ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు దవాయ్ పట్టణానికి 218 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో శకలాలను గుర్తించారు. దీంతో విమానం ఆచూకీని స్పష్టంగా గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

నాలుగు నౌకాదళ నౌకలు, రెండు ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలు ఈ గాలింపు చేపట్టాయని వారు తెలిపారు. అయితే విమానం సముద్రంలో కూలిపోయిందని, ప్రయాణికులంతా జలసమాధి అయినట్టు భావిస్తున్నామని, ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని వారు చెబుతున్నారు. కాగా, ప్రయాణికుల్లో 90 మంది ఆర్మీ కుటుంబాలకు చెందినవారని, వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

More Telugu News