: భార్యకు విడాకులు ఇచ్చిన బాలీవుడ్ సంగీత దర్శకుడు!

త‌న భార్య‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేష్‌ రేష్మియా ఆమెతో గ‌త ఏడాది డిసెంబ‌రులో విడిపోయాడు. అనంత‌రం విడాకుల కోసం హిమేష్ రేష్మియా దంప‌తులు కోర్టు మెట్లు ఎక్కారు. ఈ రోజు వీరికి బాంబే హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.  22 ఏళ్ల క్రితం కోమల్‌తో హిమేష్‌కి వివాహం జ‌రిగింది. వీరి అన్యోన్య దాంప‌త్యానికి చిహ్నంగా ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా హిమేష్‌ మాట్లాడుతూ..  చట్టబద్ధంగా, స్నేహపూర్వకంగా కోమల్‌, తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. త‌మ‌ కుటుంబాల్లోనూ అందరూ త‌మ‌ నిర్ణయాన్ని గౌరవించారని, కోమల్‌తో విడిపోయిన‌ప్ప‌టికీ ఆమె త‌మ‌ కుటుంబంలో సభ్యురాలిగానే ఉంటారని చెప్పాడు.    

More Telugu News