: నూతన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల గురించి ఈ రోజు 'సీఈసీ' న‌సీమ్ జైదీ ప్ర‌క‌ట‌న చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ పదవీకాలం వచ్చేనెల 24తో ముగుస్తుందని చెప్పారు. కాగా, రాష్ట్ర‌ప‌తి అభ్యర్థి పేరును ప్ర‌తిపాదించేందుకు 50 మంది స‌భ్యులు, బ‌ల‌ప‌ర్చేందుకు 50 మంది స‌భ్యులు ఉండాలని తెలిపారు. ఒక్కో అభ్య‌ర్థి నాలుగు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌వ‌చ్చని వివ‌రించారు. ఆర్టిక‌ల్ 324 ప్రకారం రాష్ట్రప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నికలు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈ నెల 14న‌ నోటిఫికేష‌న్ విడు‌ద‌ల చేస్తామ‌ని చెప్పారు. ఈ నెల 18 నుంచి నామినేష‌న్లను స్వీక‌రిస్తామ‌ని అన్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు ఈ నెల‌ 28 చివ‌రి తేదీ అని తెలిపారు. వచ్చేనెల 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు ఉంటాయని అన్నారు.           

More Telugu News