: ‘శభాష్’... సౌదీ రాజుకి ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్‌

ఉగ్రవాదులకు మద్దతిస్తోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌తో పాటు మరికొన్ని దేశాలు ఖతార్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూఏఈ ఖతార్‌కు వెళ్లే విమానాలను రద్దు చేసింది. యూఏఈ నిర్ణ‌యం ప‌ట్ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ రాజు సల్మాన్‌ అమిద్‌కు ఫోన్‌ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు గల్ఫ్‌ దేశాలు ఐక్యం కావాలని ఆయ‌న కోరినట్లు వైట్ హౌస్ తెలిపింది. త‌మ అధ్య‌క్షుడు ట్రంప్‌.. ఉగ్రవాద సంస్థలను ఆర్థికంగా దెబ్బతీయడం వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించార‌ని పేర్కొంది. యూఏఈ నిర్ణ‌యం గురించి తెలుసుకున్న వెంట‌నే ఉగ్రవాద నిర్మూలనకు ఇదే తొలి అడుగు కావచ్చు అంటూ ట్వీట్‌ చేసిన విషయం విదిత‌మే. యూఏఈ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ అభినందించారు.

More Telugu News