: వర్షాన్ని స్వాగతించండి, జలపూజలు చేయండి: సీఎం చంద్రబాబు పిలుపు

వర్షాన్ని స్వాగతించాలని, జలపూజలు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఆరో రోజు నవనిర్మాణదీక్షపై ముఖ్యమంత్రి అమరావతిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడం గొప్ప విషయమని, అన్యాయాన్ని అధిగమించి కసిగా అభివృద్ధి సాధించడమే నవనిర్మాణ దీక్ష లక్ష్యమని అన్నారు.

ఐదు రోజుల దీక్షల్లో 10 లక్షల మందికి పైగా పాల్గొనడం హర్షణీయమని, ‘ప్రజలే ముందు’ అనేది నాయకులకు, అధికారులకు తారకమంత్రం కావాలని చంద్రబాబు అన్నారు. భారీ వర్షాలకు చెరువులు నిండటం శుభపరిణామం అని, భూగర్భజలాలు పెరగడం ఆనందదాయకమని అన్నారు. చెరువు కట్టలు పటిష్టం చేయాలని, మరమ్మతులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. దేశంలో రెండో స్పెషల్ ఎంప్లాయిమెంట్ జోన్ ను మన రాష్ట్రానికే కేటాయించారని, ఏపీ, గుజరాత్ లో కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.

More Telugu News