: ఒంటరిగా వెళితే ఓటమే: జగన్ కు స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్!

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పోటీపడి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తే, ఓటమి ముందు నిలిచినట్టేనని, గెలవాలంటే, ఇతర పార్టీలను కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ కు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేసినట్టు సమాచారం. మరో రెండేళ్ల తరువాత వచ్చే ఎన్నికల్లో తన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాలను పన్నేందుకు ప్రశాంత్ కిశోర్ తో జగన్ డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఇక విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే, తెలుగుదేశం పార్టీకి లాభం కలుగుతుందని, దాన్ని అడ్డుకునేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన తదితర భావ సారూప్య పార్టీలను కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేస్తే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయని ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీని ఎదుర్కొనేందుకు బీహార్ లో వివిధ పార్టీల మహాకూటమి ఏర్పాటు వెనుక ప్రశాంత్ కిశోర్ ప్రమేయం ఉందన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ సలహాపై వైఎస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

More Telugu News