: నోట్ల రద్దు ప్రభావంతో భారత ఆర్థికాభివృద్ధి మందగించింది: మన్మోహన్ సింగ్

పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో భారత ఆర్థికాభివృద్ధి మందగించిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు భారీగా పడిపోయాయని, కేవలం ప్రజావ్యయం పైనే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో దేశంలో ఉపాధి అవకాశాలు భారీగా దెబ్బతిన్నాయని, దీంతో, యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. నిర్మాణ రంగం కుప్ప కూలిందని, లక్షల సంఖ్యలో ఉపాధి కోల్పోయారని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News