: ప్రజలను రెచ్చగొట్టేతత్వం ఇప్పుడు ఎక్కువవుతోంది!: సోనియాగాంధీ

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశంలో సామరస్యం కనిపించేదని... ఇప్పుడు అది కనిపించకుండా పోయిందని చెప్పారు. ఒకప్పుడు ప్రజల్లో ఆత్మస్థైర్యం ఉండేదని... ఇప్పుడు వారిలో స్తబ్ధత నెలకొందని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేతత్వం ఇప్పుడు ఎక్కువవుతోందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి భారత్ ను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం తిరోగమనం దిశలో ముందుకు సాగుతోందని చెప్పారు. శాంతియుత పరిస్థితులు దెబ్బతిన్నాయని... భిన్నత్వంలో ఏకత్వం నుంచి భిన్నత్వం వైపు అడుగులు పడుతున్నాయని అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని... నేతలంతా వ్యక్తిగత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

More Telugu News