: పాకిస్థాన్ బరితెగించింది... ఇండియా భూమిని చైనాకు అమ్మేస్తోంది!

పొరుగు దేశం పాకిస్థాన్ బరితెగిస్తోంది. చైనా సామ్రాజ్యవాద కాంక్షకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో, 70 ఏళ్ల కిందట భారత్ నుంచి దొంగచాటుగా ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్ లోని చాలా భాగాన్ని చైనాకు పాక్ విక్రయిస్తోంది. స్థానికులకు ఇష్టం లేకుండానే... ఈ భూములను చైనాకు కట్టబెట్టుతోంది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట ఈ భూమిని అమ్మేస్తోంది. చైనాలోని పలు కంపెనీలకు, చైనా ఆర్మీకి భూములను అమ్మేస్తున్నారంటూ ఆ ప్రాంతంలోని జనాలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాక్ ఆర్మీ జనరల్స్ వారి భూమిని బలవంతంగా ఆక్రమిస్తున్నారట. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నవారిని చంపేయడం, లేదా ఎలాంటి విచారణ లేకుండానే శిక్షించడం చేస్తున్నారట.

ఇప్పటిలే వేలాది మంది గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రజలు తమ భూములను కోల్పోయారు. ఈ ప్రాంతంలో చైనా, పాక్ సైన్యాలు ఉండేలా పెద్ద కంటోన్మెంటులు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతోందట. ఈ నిరంకుశత్వంపై ఎవరూ నోరెత్తలేని పరిస్థితి నెలకొందని... చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కు వ్యతిరేకంగా మాట్లాడినవారి జీవితాలను నాశనం చేస్తున్నారని గిల్గిత్-బాల్టిస్థాన్ థింకర్స్ ఫోరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News