: మళ్లీ తెరపైకి వేర్పాటువాదం.. స్వర్ణ దేవాలయంలో 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు!

ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి 'ఖలిస్థాన్' నినాదాలు మారుమోగాయి. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద భారీ సంఖ్యలో గుమికూడిన సిక్కులు... ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వందలాది మంది సిక్కులు ఈ నినాదాలు చేశారని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ కార్యక్రమం కోసం ప్రతి ఏడాది ప్రపంచ నలుమూలల నుంచి సిక్కులు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా ఆపరేషన్ బ్లూ స్టార్ మెమోరియల్ ను సందర్శిస్తారు. ఇందిరాగాంధీని చంపిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్, కేహర్ సింగ్ ల ఫొటోలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా ప్రత్యేక సిక్కు దేశాన్ని కోరుతున్న ఖలిస్థాన్ నేత జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే తో పాటు, సాయుధులైన ఆయన అనుచరులను ఆ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మట్టుబెట్టించింది.  




More Telugu News