: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి ధర్నాకు దిగిన ఏపీ ఎన్జీవోలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత, ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నేడు తొలిసారిగా ధర్నా జరుగుతోంది. విజయవాడలోని ధర్నా చౌక్ లో, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలన్న డిమాండ్ తో పాటు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఈ ధర్నాలో పాల్గొని, ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. తాము తొలిసారి ధర్మాకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూ రాష్ట్రానికి వచ్చారని, వారి ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.

More Telugu News