: ఇండియాలో తొలిసారి... వాట్స్ యాప్ చాటింగే సాక్ష్యంగా న్యాయ విద్యార్థులకు 20 ఏళ్ల జైలు శిక్ష

వారు న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. తమ యూనివర్శిటీలో జూనియర్ గా చేరిన అమ్మాయిని రెండేళ్ల పాటు లైంగికంగా వేధించారు. పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె నగ్న చిత్రాలను సేకరించి, అందరితో పంచుకోవడంతో పాటు, యాపిల్ ఐ క్లౌడ్ లో దాచాడు. తమ విషయం ఎవరికైనా చెబితే, పరువు తీసేస్తామని బెదిరించారు. దూర ప్రాంతాలకు బలవంతంగా తీసుకెళ్లి కోరిక తీర్చుకుని తెచ్చేవారు. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టు ముందుకు తీసుకురాగా, 2015 ఏప్రిల్ నుంచి సాగిన కేసులో తీర్పు వెలువడింది. నిందితులు, బాధితురాలికి మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణనే కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తూ, ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, మరో విద్యార్థికి ఏడేళ్ల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే,  హర్యానాలోని సోనేపట్‌ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్‌ విద్యార్థులు. 2013 ఆగస్టులో బాధితురాలు న్యాయవిద్య నిమిత్తం వర్శిటీలో చేరింది. ఆమెపై కన్నేసిన నిందితులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఆమెను పలు విధాలుగా వేధించారు. సెక్స్ టాయ్స్ కొనిచ్చి వాటిని వాడుతూ, స్కైప్ లో లైవ్ వీడియో చూపించాలని బెదిరించారు. వీరి మధ్య సాగిన అన్ని అంశాలూ వాట్స్ యాప్ లో భద్రంగా ఉండిపోయాయి. ఇక కేసును విచారించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి సునీతా గ్రోవర్, నిందితులు వాడిన పదాలు అసభ్యంగా, దారుణంగా ఉన్నందున తీర్పులో వాటిని కనీసం ప్రస్తావించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. వాట్స్ యాప్ సంభాషణలే సాక్ష్యంగా పరిగణిస్తున్నానని చెబుతూ తన తీర్పును వెలువరించారు.

More Telugu News