: ‘బాహుబలి’ విషయంలో నా తీర్పు తప్పయినందుకు చాలా ఆనందంగా ఉంది: కీరవాణి

‘బాహుబలి’ని ఒక భాగంగానే తీయమని తాను సలహా ఇచ్చానని, అయితే, రెండు భాగాలుగా విడుదలై ఈ చిత్రం ఎంతో ఘనత సాధించిందని, తన తీర్పు తప్పైనందుకు చాలా సంతోషంగా ఉందని ప్రముఖ దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో జరిగిన సంభాషణలో కీరవాణి మాట్లాడారు. దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ కథ చెప్పే సమయంలో ఈ సినిమాను ఒక్క భాగంగా తీయాలా లేక రెండు భాగాలుగా తీయాలా అని అడిగారు. ఒక చిత్రంగా తీయమని తాను చెప్పానని, ఎందుకంటే, ఇలాంటి సినిమాకు ఎక్కువ మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కావాల్సి వస్తుందని చెప్పానని అన్నారు. అలాంటి అడ్డంకులను తప్పించుకోవడానికి ఒకే భాగంగా ఈ సినిమా తీయమని చెప్పానని, కానీ, రెండు భాగాలుగా తీయడం వల్లే ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిందని చెప్పుకొచ్చారు.

More Telugu News