: పవన్ కల్యాణ్ కి మాజీ భార్యగానే ఉంటా.. మరో పెళ్లి చేసుకోను: రేణు దేశాయ్ స్పష్టీకరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తనకున్న అనుబంధం పట్ల ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో లో ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండిపోతానని చెప్పారు. తామిద్దరం విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకున్నప్పటికీ, తాను మాత్రం మరో పెళ్లి చేసుకోబోనని ఆమె స్పష్టం చేసింది. పవన్ మాజీ భార్యగా తనకు ఎంతో గుర్తింపు ఉందని... పవన్ అభిమానులంతా తనను ఇప్పటికీ 'వదిన' అనే పిలుస్తుంటారని చెప్పింది. వారి అభిమానం, ప్రేమకు తాను దూరం కాదలుచుకోలేదని తెలిపింది. పవన్ మాజీ భార్యగా చలామణి అవుతూనే, కన్నడ సినీ పరిశ్రమలో సొంత గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పింది. 

More Telugu News