: మిరాకిల్: రైలు గుద్దేసింది... అయినా ఆ యువతి బతికింది.. వీడియో చూడండి!

రైలు కింద పడి బతకడం అంటే వారి ఆయుష్షు గట్టిదనే చెప్పాలి. అది ఈ ఏడాది మే 13. ముంబైలోని కుర్ల రైల్వే స్టేషన్. ప్లాట్ ఫామ్ నంబర్ 7. రైలు కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉన్నారు. అది లూప్ లైన్ కావడంతో ఈ లోపు ఓ గూడ్స్ రైలుకు లైన్ ఇచ్చారు. ఇంతలో 19 ఏళ్ల యువతి రెండు చెవులకూ హెడ్ ఫోన్స్ తగిలించుకుని స్నేహితుడితో మాట్లాడుకుంటూ గూడ్స్ రైలు వస్తున్న ట్రాక్ పైనే నడుస్తూ వస్తోంది. ప్రయాణికులు పెద్దగా కేకలు వేస్తూ ఆ యువతికి రైలు గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమెకు వినిపిస్తేగా... ఆమె కూడా ఏడవ నంబర్ ప్లాట్ ఫామ్ పైకి చేరుకునేందుకే ఆ ట్రాక్ పైకి వచ్చింది.

సడెన్ గా రైలు ను చూసి భయంతో ప్లాట్ ఫామ్ ఎక్కే ప్రయత్నం చేయబోయి సమయం లేకపోవడంతో తిరిగి ట్రాక్ అవతలి వైపుకు వెళ్లాలనుకుంది. ఇంతలో రైలు రానే వచ్చింది... ఆమెను ఢీకొని ముందుకు వెళ్లి ఆగింది. అందరూ ఆ అమ్మాయి ప్రాణం పోయే ఉంటుందని భయపడిపోయారు. కానీ, తీరా చూసేసరికి ఆమె నిక్షేపంలా, సజీవంగా ఉంది. ఒక కన్నుకు మాత్రం స్వల్ప గాయమైంది. ఆమె పేరు ప్రతీక్షా నతేకర్. బంధుప్ ప్రాంత వాసి. ఫ్రెండ్ ను కలవాలని చెప్పి కుర్ల ప్రాంతానికి వచ్చి ఈ ప్రమాదం తెచ్చుకుంది. ఇదంతా స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ పై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో చూడండి.

More Telugu News