: పోర్న్ స్టార్ అవుతానని మీ కూతురు అడిగితే.. మీరు ఒప్పుకుంటారా?.. అనే ప్రశ్నకు వర్మ సమాధానం ఇది!

'మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహతీ హై' పేరుతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు వివాదాస్పదం కూడా అవుతోంది. కుమార్తె తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకున్నప్పుడు అడ్డు చెప్పని తల్లిదండ్రులు... పోర్న్ రంగాన్ని ఎంచుకుంటే ఎందుకు అడ్డు చెబుతారన్నదే ఈ షార్ట్ ఫిల్మ్ కథాశం. ఈ నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి ఓ మీడియా సంస్థకు వర్మ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. 'ఒకవేళ మీ కూతురు పోర్స్ స్టార్ అవుతానని మిమ్మల్ని అడిగితే... మీరు అంగీకరిస్తారా?'... ఆదే ఆ ప్రశ్న.

పై ప్రశ్నకు వర్మ తనదైన శైలిలో స్పందించాడు. తన కూతురు అయినంత మాత్రాన... ఆమె ఏం చేయాలి? ఏం చేయకూడదు అని చెప్పడానికి తాను ఆమె టీచర్ ను కాదని అన్నాడు. ప్రకృతి పరంగా తన తల్లి దండ్రులకు తాను ఎలా పుట్టానో... తనకు, తన భార్యకు తన కుమార్తె అలానే పుట్టిందని చెప్పాడు. ఈ భూమ్మీద ఉన్నవాళ్లంతా ఓ ప్రకృతిపరమైన చర్యవల్ల పుట్టినవాళ్లే అని తెలిపాడు. అలాంటప్పుడు డాక్టర్ కావాలా, ఇంజినీర్ కావాలా, పైలట్ కావాలా, సైనికురాలు కావాలా, రాడికల్ కావాలా, పోర్న్ స్టార్ కావాలా అని నిర్ణయించుకునే హక్కు ఆమె సొంతమని చెప్పాడు. ఆమె పుట్టింది తాను స్వతహాగా జీవించడానికని, తాను చెప్పినట్టు బతకడానికి కాదని అన్నాడు. తాను సలహా మాత్రమే ఇవ్వగలనని... ఏ రంగాన్ని ఎంచుకోవాలనేది మాత్రం ఆమె వ్యక్తిగత అంశమని చెప్పాడు. 

More Telugu News