: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం: సీఎం చంద్రబాబు

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, కష్టాల్లో ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్ లో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో భాగంగా మూడో రోజున ఆయన మాట్లాడుతూ, ఏపీకి అన్ని వనరులు ఉన్నా, అడుగడుగునా నష్టం జరిగిందని, ప్రతిఒక్కరూ గత చరిత్ర నెమరువేసుకుంటే భవిష్యత్తులో ఎలా ముందుకుపోవాలో అవగాహన వస్తుందని, ప్రజలందరూ క్రమశిక్షణతో మెలిగితేనే అభివృద్ధి వైపు వెళ్లగలుగుతామని సూచించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను నాలెడ్జ్ హబ్ గా తయారు చేశానని, ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మరీ హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, దక్షిణ భారతదేశంలోనే తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీ అని, రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన నేతలు, ఇప్పుడు ఏపీ ప్రజలపై ప్రేమ చూపిస్తున్నారని, ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని చంద్రబాబు అన్నారు.

More Telugu News