: దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పాల్సిందే: అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య

సినీ దర్శకుడు హరీష్ శంకర్ పై బ్రాహ్మణుల ఆగ్రహం కొనసాగుతూనే ఉంది. ఎందరో భక్తులు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఎంతో నిష్టతో పఠించే శివుడికి చెందిన నమకం, చమకాలను... ఇష్టానుసారంగా పాట రూపంలో చిత్రీకరించిన హరీష్ శంకర్ తమకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణులను, వారి ఆచార వ్యవహారాలను వ్యంగ్యంగా తెరకెక్కించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'దువ్వాడ జగన్నాథం' సినిమాలో నమకం, చమకం పదాలను ప్రేమగీతంలో పెట్టడం...శైవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఆ సినిమా నుంచి తక్షణమే ఆ పాటను తీసివేయాలని డిమాండ్ చేశారు. సినిమా నిర్మాత, దర్శకుడు, నటులపై సిటీ పోలీస్ కమిషనర్ ను కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ ఈ విధంగా స్పందించారు.

More Telugu News