: రాజకీయ దిగ్గజం కరుణానిధి మన తెలుగువారే.. వారి పూర్వీకులది ప్రకాశం జిల్లా!

డీఎంకే అధినేత కరుణానిధి అంటేనే ఓ కరుడుగట్టిన తమిళ నేత. తమిళ ఉద్యమకారుడిగా, రాజకీయ ధురంధరుడిగా ఆయనకు అత్యంత జనాదరణ ఉంది. అయితే కరుణాధి తమిళుడు కాకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. కరుణ ఓ తెలుగుబిడ్డ అంటే ఎవరైనా షాక్ అవుతారు. కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. 1924లో తంజావూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్, అంజుగం దంపతులకు ఆయన జన్మించారు.

8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న కరుణకు... సాహిత్యమంటే ప్రాణం. ఉద్యమాలంటే మరీ ఇష్టం. మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి అయిన కరుణ... ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రకరకాల నాటికలు వేసేవారు. 14 ఏళ్ల వయసులోనే హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో సార్లు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేగా 60 ఏళ్లను కరుణ పూర్తి చేసుకున్నారు.

More Telugu News