: మానవత్వాన్ని చాటిన భారత్... పాక్ పసికందుకు మెడికల్ వీసా!

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు హృద్రోగ వ్యాధితో బాధపడుతున్న 75 రోజుల పాకిస్థానీ శిశువు ఎందుకు శిక్షించబడాలని ప్రశ్నిస్తూ.... నా కుమారుడికి భారత్ లో వైద్యం చేయించాలనుకుంటున్నానని, వీసా ఇచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు పాకిస్థాన్ కు చెందిన కెన్ సిద్ అనే వ్యక్తి ట్వీట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి బిడ్డ శిక్షించబడకూడదని, వెంటనే వెళ్లి పాకిస్థాన్ లోని భారత ఎంబసీ అధికారులను కలవాలని ఆమె సూచించారు.

దీంతో వెళ్లి భారత్ ఎంబసీ అధికారులను కలిసి, అవసరమైన పత్రాలు సమర్పించిన కెన్ సిద్...నాలుగు నెలల మెడికల్ వీసా పొందారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, ‘ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. మానవత్వాన్ని చాటినందుకు ధన్యవాదాలు. మానవత్వం బతికే ఉంది. అందరికీ దేవుడి అనుగ్రహం ఉండాలి’ అంటూ ట్వీట్ చేశాడు.

More Telugu News