: గ‌డ్డు ప‌రిస్థితులు.. టెలికాం సెక్టార్‌లో 40 వేల ఉద్యోగాల కోత

టెలికాం సెక్టార్‌లో భారీగా ఉద్యోగాల కోత ఉండనుంద‌ని రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ ఈ రోజు తెలిపింది. ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ గ‌త ఏడాది ఈ రంగంలో 10 వేల ఉద్యోగుల‌ను తీసివేశార‌ని, ఈ ఏడాది కూడా 40వేలకు పైగా ఉద్యోగాల కోత ఉంటుందని తెలిపారు. ప్ర‌స్తుతం టెలికాం సెక్టార్‌లో పోటీ మ‌రింత తీవ్రత‌రం అయింద‌ని చెప్పారు. రేటింగ్ ఏజెన్సీలు కూడా ఈ విధ‌మైన అభిప్రాయాన్నే వ్య‌క్తం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. భారీ రుణభారంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కి గ‌డ్డు ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. త‌మ‌ కంపెనీ రుణభారాన్ని తగ్గించుకునేందుకు తాము ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నామ‌ని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్ర‌స్తుతం డేటా రేట్లు కూడా ప‌డిపోవ‌డంతో రెవెన్యూ కోల్పోతున్న‌ట్లు తెలిపారు.      

More Telugu News