: ఆదాయపన్ను శాఖ హెచ్చరిక... రూ.2 లక్షలు దాటిన నగదు లావాదేవీలపై కఠిన చర్యలు

నగదు లావాదేవీల విషయంలో ఆదాయపన్ను శాఖ తాజాగా మరోసారి హెచ్చరికలు చేసింది. రూ.2 లక్షలు, ఆపై లావాదేవీలను నగదు రూపంలో నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి రూ.2 లక్షలు, ఆ పై లావాదేవీలను నగదు రూపంలో నిర్వహించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. డీమోనిటైజేషన్ తర్వాత నల్లధనం నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా రూ.2లక్షల పైన నగదు స్వీకరిస్తే, వారి నుంచి అంతే మొత్తాన్ని జరిమానా కింద వసూలు చేస్తామని ఐటీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రముఖ పత్రికల్లో ప్రకటనలను విడుదల చేసింది. కాకపోతే, బ్యాంకులు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. ఈ కేంద్రాల వద్ద రూ.2 లక్షలు దాటిన మొత్తాలను కూడా జమ చేసుకోవచ్చు.

More Telugu News