: రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్ గురించి అలియా భట్ ఏమందంటే...!

బాలీవుడ్ యంగ్ క్రేజీ స్టార్స్ రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటిస్తూ ఇద్దరూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. రణ్ వీర్ సింగ్ సొంతంగా స్టార్ డమ్ సంపాదించుకోగా, రణ్ బీర్ కపూర్ కుటుంబ నేపథ్యంతో స్టార్ గా ఎదిగాడు. ఇప్పటికే బాలీవుడ్ లో తమను తాము నిరూపించుకున్న వీరిద్దరి గురించి విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న అలియా భట్ మాట్లాడింది.

రణ్ వీర్ సింగ్ తో చాలా ప్రచార చిత్రాల్లో నటించానని గుర్తు చేసింది. రణ్ వీర్ సింగ్ చాలా హుషారుగా, క్రేజీగా ఉంటాడని చెప్పింది. సినిమాల్లో ఎలా నటిస్తాడో బయట కూడా అలాగే ఉంటాడని చెప్పింది. అదే రణ్ వీర్ ను ప్రజలకు దగ్గర చేస్తుందని అలియా చెప్పింది. అలాగే రణ్ బీర్ గురించి చెబుతూ, రణ్ బీర్ చాలా కామ్ గా ఉంటాడని తెలిపింది. రణ్ బీర్ అన్నీ గమనిస్తాడని, చాలా ప్రశాంతంగా ఉంటాడని చెప్పింది. తన టాలెంట్ ను నటనలో చూపిస్తాడని చెప్పింది. సావరియా సినిమా చూసిన దగ్గర నుంచీ తాను రణ్ బీర్ కు వీరాభిమానినయ్యానని చెప్పింది. అలాంటిది ఆయనతో కలిసి నటిస్తున్నానంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది. కాగా, అలియా భట్ ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో 'గల్లీ బాయ్', రణ్ బీర్ కపూర్ తో 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తోంది.

More Telugu News