: సత్య నాదెళ్లను ఆకట్టుకున్న 12 ఏళ్ల సీఈవో!

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను 12 ఏళ్ల ఓ బాలిక ఆకట్టుకుంది. మిఖైలా ఉల్మర్ అనే ఈ చిన్నారి 'మీ అండ్ ది బీస్ లెమనేడ్' అనే సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ సహజ, సేంద్రీయ ఆహార పరిశ్రమలో సంచలనాలు సృష్టిస్తోంది. తేనెను కలిపిన లెమనేడ్ ను తయారు చేస్తూ లాభాలలో దూసుకుపోతోంది. ఈమె ప్రయాణం నాలుగేళ్ల వయసులోనే ప్రారంభమైంది.

2016లో రీటెయిల్ వ్యాపార భవిష్యత్తును మార్చబోయే టాప్ 25 మందిలో ఒకరిగా ఆమె 2016లో ఎంపికైంది. ఇదే సమయంలో ఓ కాన్ఫరెన్స్ లో సత్య నాదెళ్లతో కలసి ఆమె కూడా పాల్గొంది. ఈ సందర్భంగా తన గురించి మిఖైలా చెప్పిన విషయాలు సత్య నాదెళ్లను చాలా ఆకట్టుకున్నాయి. అంతేకాదు... నీ కథను చెప్పినందుకు, ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపినందుకు చాలా థాంక్స్ అంటూ సత్య కొనియాడారు. ఈ మధ్యనే ఆయన చేసిన మరో ట్వీట్ లో... తాను కలుసుకున్న సీఈవోలందరిలో మిఖైలా తనను చాలా ఆకట్టుకుంది అని చెప్పారు.

More Telugu News