: స్థానిక భాషల్లో ప్రధాని ‘మనసులో మాట’.. ఏర్పాట్లు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ఇక దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లోనూ వినిపించనుంది. మోదీ ప్రసంగాన్ని స్థానిక మాండలికాల్లోకి  అనువదించడం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను చేరుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా హిందీ, ఇంగ్లిష్ తెలియని మారుమూల ప్రజలకు ప్రధాని సందేశం చేరుతుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్రాలతో చర్చలు జరిపినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయా స్థానిక భాషల్లో దానిని అనువదించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరినట్టు చెప్పారు. ఆయా రాష్ట్రాల సమాచార మంత్రిత్వశాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో నిపుణులైన వారిని నియమించుకునే పనిలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం జార్ఖండ్, హరియాణా, చత్తీస్‌గడ్‌లు ఈ విషయంలో ముందంజలో ఉండగా మిగతా రాష్ట్రాలు కూడా ఏర్పాట్లలో ఉన్నాయి. అయితే మోదీ మన్‌కీ బాత్‌కు సంబంధించి గతంలోని వాటికి అనువాదాలు లభించవు.

More Telugu News