: ‘పోర్న్ వీడియో ప్రతీకారం’పై కేంద్రం కఠిన చర్యలు.. చట్టంలో మార్పులు!

మహిళలపై వరుసగా వెలుగు చూస్తున్న దారుణాలపై కేంద్రం దృష్టి సారించింది. పోర్న్ వీడియోలు చూపించి మహిళలను బెదిరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందుకోసం చట్టంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా మహిళలను వేధించే వారి భరతం పట్టాలని భావిస్తున్న మహిళ, శిశు సంక్షేమ శాఖ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. చట్టంలోని నియమాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించి ‘రివేంజ్ పోర్న్’ భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది.

తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన మహిళల ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టడాన్ని ‘రివేంజ్ పోర్న్’గా వ్యవహరిస్తారు. ఆన్‌లైన్‌లో పెరిగిపోతున్న ‘రివేంజ్ పోర్న్’పై మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని అణచివేసేందుకు ప్రత్యేక చట్టాలు ఏమీ అవసరం లేదని, ఉన్నవాటిని మరింత కఠినంగా అమలు చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News