: టీమిండియా చీఫ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వీరేంద్ర సెహ్వాగ్

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ అనంత‌రం టీమిండియా చీఫ్‌ కోచ్ అనిల్ కుంబ్లే ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌డంతో ఆ ప‌దవి కోసం బీసీసీఐ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. కోచ్ ప‌దవి కోసం అనిల్ కుంబ్లేతో పాటు శ్రీలంక ప్రస్తుత కోచ్ టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఫైబస్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో భార‌త క్రికెట్‌ అభిమానుల దృష్టి అంతా ఆయ‌న‌పైనే ప‌డింది. అయితే, సెహ్వాగ్‌కు గతంలో కోచింగ్ అనుభవం లేకపోవడంతో ఆయన సెలెక్ట్ కాక‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌ లాల్ చంద్ రాజ్‌పుత్‌.. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారతజట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌రో వ్య‌క్తి మూడీ ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఇక‌ పైబస్ కు గతంలో పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన అనుభ‌వం ఉంది.             

More Telugu News