: తెలంగాణలో పెరుగుతున్న పరువు హత్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న పరువు హత్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాధారణ ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులు, డబ్బున్న వారివైపు ఉండటం వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడింది. వచ్చిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోందని ఆక్షేపించింది.

నరేష్, స్వాతిల కేసులో నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి చంపాడని ఈ ఉదయం హైకోర్టుకు పోలీసులు నివేదికను ఇచ్చారు. నరేష్ చనిపోయిన కారణంగా ఆయన తండ్రి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. పిటిషన్ కొట్టివేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించిన కోర్టు, ఈ పిటిషన్ పై వాదనలు ముగిస్తున్నట్టు ప్రకటించింది. పిటిషనర్లకు ఇంకా ఏమైనా అనుమానాలుంటే తమను ఆశ్రయించ వచ్చని పేర్కొంది. ఈ మొత్తం ఘటన దురదృష్టకరమని తెలిపింది. మరో మారు ఇటువంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించింది.

More Telugu News