: దేశంలో తొలిసారి.. తెలంగాణ ప్రభుత్వం నుంచి టి-వాలెట్.. నేడే ప్రారంభం!

తెలంగాణ ప్రభుత్వం నుంచి టి-వాలెట్ పేరుతో సరికొత్త పేమెంట్ యాప్ రాబోతోంది. ఎక్కడైనా, ఎప్పుడైనా డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దిన ఈ యాప్‌ను నేడు (గురువారం) ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ యాప్‌ను గతేడాది నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులకే ప్రారంభించాలని భావించారు. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘భీం’ పేరుతో అటువంటి యాప్‌నే ప్రారంభించడంతో పాటు, ఇతర కారణాలతో ఆలస్యమైంది.

ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి యాప్‌ను ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా విద్యుత్, వాటర్, ఆస్తి పన్ను, ఆర్‌టీఏ చలాన్లను ఎటువంటి రుసుము లేకుండా చెల్లించవచ్చు. అదే సమయంలో ప్రైవేటు లావాదేవీలకు మాత్రం నామమాత్రంగా రుసుము వసూలు చేస్తారు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా, భద్రంగా ఉండేలా రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఐటీ విభాగాన్ని ఆదేశించినట్టు అధికారులు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, వెబ్‌సైట్‌లోనూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో దీనిని రూపొందించారు. స్మార్ట్‌ఫోన్లు లేని వారు మీ-సేవా కేంద్రానికి వెళ్లి టి-వాలెట్‌ను ఓపెన్ చేసి డబ్బులు లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News