: ట్రంప్ క్విజ్: చిత్రమైన పదానికి అర్థం కనుక్కోమన్న అమెరికా అధ్యక్షుడు... వైరల్ ట్వీట్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్రమైన పదాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి, దానికి సరైన అర్థాన్ని ఎవరు కనుక్కొనగలరు? అంటూ ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలోని ట్రంప్ అభిమానులు బిజీ అయిపోయారు. ఆయన అన్న ఆ మాటకు అర్థం ఏంటి? అనేది కనుక్కోవడంలో తలమునకలై ఉన్నారు.

డొనాల్డ్ ట్రంప్ అల్లుడు డేజ్ కుష్నర్ వివిధ ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన covfefe అనే పదాన్ని రాశారు. ఈ పదానికి అర్థం ఎంతమంది కనుక్కోగలరు? అంటూ ట్వీటారు. ఆయన అలా ట్వీటగానే ఇది వైరల్ గా మారింది. లక్షలాది లైకులు, రీట్వీట్లు, కామెంట్లతో ఇది హోరెత్తుతోంది. ఇంతకీ ఆ పదం ఏంటి? అనే చర్చ కూడా నడుస్తోంది.


More Telugu News