: ప్యారిస్ ఒప్పందానికి చెల్లుచీటీ... మరో కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్!

ఎవ‌రి మాటా విన‌కుండా సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మ‌రో కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో తమ దేశం చేసుకున్న ఓ ఒప్పందాన్ని ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న సుమారు 70 దేశాలు గ‌తంలో ఓ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాన్ని 'ప్యారిస్ ఒప్పందం'గా పిలుస్తారు. అయితే, అందులోంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒప్పందంపై అమెరికా ఇప్ప‌టివ‌ర‌కు సంత‌కం చేయ‌న‌ప్ప‌టికీ అందులో భాగస్వామిగానే ఉంది. దానిపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సంత‌కం చేయాల్సి ఉంది. అయితే, ఆ ఒప్పందంపై సంత‌కం చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తామ‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు.         

More Telugu News